MBNR: కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులను అన్యాయం చేస్తున్నారని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి విమర్శించారు. దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం బారులు తీరిన జనాలను చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రైతులకు యూరియా సరఫరా చేయాలన్నారు.