SKLM: పాతపట్నం మహేంద్ర తనయ నదీ పరివాహక ప్రాంతంలో చరిత్ర కలిగిన శ్రీ నీలకంటేశ్వర స్వామి వారికి భాద్రపద పంచమి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాతక్కాల దర్శనం అనంతరం స్వామివారికి శనగల నైవేద్యాన్ని పుష్పాలంకరణ పూజా కార్యక్రమాల్ని చేపట్టారు. తెల్లవారుజామునే పలువురు భక్తులు స్వామిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు.