అమెరికాలో కాల్పుల కలకలం రేపింది. మిన్నెసోటా మినియాపొలిస్‌లో ఓ క్యాథలిక్ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరో 17 మందికి గాయాలయ్యాయి. అందులో 14 మంది పిల్లలున్నట్లు తెలిపారు. విద్యార్థుల ప్రార్థన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు చెప్పారు.