అమెరికా టెక్ కంపెనీలపై పలు దేశాలు విధిస్తున్న డిజిటల్ పన్నులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా కంపెనీలపై ఎలాంటి పన్నులు వేయకుండా వివక్షపూరితంగా అగ్రరాజ్య సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. ఇది ఆగకుంటే ఆయా దేశాలపై అదనపు సుంకాలు తప్పవని హెచ్చరించారు. తమ సంస్థలు మీకు పిగ్గీ బ్యాంకులు కావని.. అమెరికాను, తమ టెక్ కంపెనీలను గౌరవించాలని పేర్కొన్నారు.