SDPT: చేర్యాల సర్కిల్ సీఐ ఎల్.శ్రీను, ఎస్ఐ వి.నవీన్ సూచించినట్లుగా, గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. జలదిగ్బంధంలో ఉంటే 87126 67355, 87126 67356 నంబర్లకు సంప్రదించాలని కోరారు.