NRML: భారీ వర్షాల నేపథ్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం రాత్రి జీఎన్ఆర్ కాలనీని పరిశీలించారు. వర్షాల వల్ల తలెత్తే సమస్యలను గమనించి, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. నీటి ముంపు ప్రాంతాల్లో డ్రైనేజీ సదుపాయాలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు