VZM: వినాయక చవితి సందర్భంగా కొత్తవలస పాత రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శ్రీ సత్యసాయి మందిరంలో ప్రత్యేక భజనలు బుధవారం నిర్వహించారు. ఉదయం మందిరంలో వినాయకుని పూజ చేశారు. సాయంత్రం జరిగే భజనలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, సత్యసాయి పాటలు ఆలపించారు. విఘ్నేశ్వరుడికి ప్రీతి పాత్రమైన ఉండ్రాళ్ళు, వడపప్పు ప్రసాద వితరణ చేశారు. ఈ భజనలో కన్వినర్ రవికుమార్ పాల్గొన్నారు.