SS: ధర్మవరం శివానగర్ గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక, డోర్ నెం. 4/923 వద్ద కాలువలో చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వినాయక మండపం ఎదురుగా ఉండడంతో భక్తులు కూడా దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువను తక్షణమే శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.