MNCL: చెన్నూర్ పట్టణంలో అమృత్ 2.0లో భాగంగా చేపట్టిన నీటి ట్యాంక్ నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో నల్లా కనెక్షన్ల ద్వారా ఇంటింటికి శుద్ధమైన త్రాగునీటిని అందించడం జరుగుతుందని, అమృత్ 2.0 ద్వారా అన్ని నివాసాలకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.