KRNL: సేవ రంగంలో మదర్ థెరిసా చేసిన సేవలు వెలకట్టలేనివని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. మదర్ థెరిసా 116వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం కర్నూలులోని ప్రకాష్ నగర్లో ఉన్న మదర్ థెరిసా విగ్రహానికి అభయగిరి పిల్లలతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మదర్ థెరిసా జాతీయ అవార్డు గ్రహీత సురేంద్ర పాల్గొన్నారు.