E.G: నోటి మాటలే కాదు చేతల్లో కూడా సీఎం చంద్రబాబు కోతలే పెడుతున్నారని కొవ్వూరు వైసీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు ఎద్దేవా చేశారు. మంగళవారం సాయంత్రం చాగల్లు మండలం నందిగంపాడులో ‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు.