MLG: కన్నాయగూడెం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ దివాకర్ టీఎస్ మంగళవారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. క్వార్టర్లలో ఉంటూ అనారోగ్య సమస్యలకు, వర్షాకాల వ్యాధులకు చికిత్స అందించాలన్నారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.