NLR: పేదరికంతో పోరాడుతున్న దివ్యాంగుడైన తండ్రికి చెందిన పొన్నవాడ ప్రమోద్ కుమార్ అనే విద్యార్థికి వీపీఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. నెల్లూరులోని విశ్వ సాయి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రమోద్ కుమార్కు, అతని ద్వితీయ సంవత్సర విద్య కోసం బుధవారం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. అంకీత భావంతో చదువును పూర్తి చేసి ఉన్నత స్థాయిలో నిలవాలని సంస్థ సభ్యులు తెలిపారు.