NDL: ఆళ్లగడ్డ గ్రామీణంలో ఎగువ అహోబిలం క్షేత్రంలోని మెట్ల మార్గంలో బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ బండరాయి కిందపడడంతో ఒక చెట్టు, కరెంటు స్తంభం నేలకూలాయి, విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అదృష్టవశాత్తూ, ప్రమాదం జరిగిన సమయంలో మెట్ల మార్గంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.