MDK: మాసాయిపేట మండల కేంద్రంలో కుక్క కాటుక గురై మెదక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరామర్శించారు. సోమవారం రాత్రి వీధుల్లో ఊర కుక్కలు దాడులు చేసి 20 మందిని గాయపరిచింది. తీవ్ర గాయాలకు గురైన నలుగురు మెదక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే వారిని పరామర్శించి ఆదుకుంటామని భరోసా కల్పించారు.