ASF: భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ సూచించారు. బుధవారం వారు పలు సూచనలు చేశారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద జాగ్రత్తగా ఉండాలని, మండపాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు దాటొద్దని సూచించారు.అత్యవసర సమయంలో పోలీసులను సంప్రదించాలన్నారు.