పారిస్‌లో జరుగుతున్న BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. రెండో రౌండ్లో మలేషియా క్రీడాకారిణి కరుపతెవన్ లెట్షానాతో జరిగిన మ్యాచ్‌లో సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. వరుస సెట్లలో (21-19, 21-15) తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఫ్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.