KMR: ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ చెరువు కట్ట భారీ వర్షాలకు తెగిపోయింది. బుధవారం సాయంత్రం వరకు చెరువు నుండి భారీగా నీరు బయటకు వెళ్తుంది. ఈ చెరువును నమ్ముకొని దాదాపు వెయ్యి ఎకరాల్లో వరి పంటను రైతులు వేశారు. చెరువు కట్ట తెగడంతో ఇప్పటికే 500 ఎకరాల్లో పంట నీట మునిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.