SKLM: ఆమదాలవలస కొత్త రోడ్ జంక్షన్ వద్ద శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని శక్తి టీం ఇంఛార్జి రమణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలతో శక్తి యాప్ ఇన్స్టాలేషన్ విధానాన్ని ప్రజలకు వివరించి, మహిళలతో శక్తి యాప్ డౌన్లోడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శక్తి యాప్ టోల్ ఫ్రీ నంబర్ల పని తీరు గురించి స్థానికులకు చెప్పారు.