SRD: భారీ వర్షానికి ప్రభుత్వ పాఠశాల తరగతి గది కూలింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గది వర్షానికి కూలింది. కాగా నేడు పాఠశాలకు సెలవు కావడం విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన తరగతి గదులను నిర్మించాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు.