GNTR: గుంటూరు వైద్య కళాశాలలో ఈసారి MBBS ప్రవేశాలు తొలిరోజు బుధవారం చాలా సునాయాసంగా ముగిశాయి. తల్లిదండ్రులు, విద్యార్థులందరూ ఒకే హాలులో కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. ఫీజులు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించే అవకాశం ఇచ్చారు. ప్రిన్సిపల్ అక్కడే కూర్చొని ప్రవేశాలు ఇచ్చారు. గతంలా బ్యాంకుకు వెళ్లి DDలు తీసుకునే ఇబ్బంది లేకుండా చేశారు. దీనిపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.