E.G: రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లాలో ఇవాళ కూడా ఓ మోస్తారు స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది గమనించి ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు కూడా అవసరమైతేనే బయటికి రావాలని హెచ్చరించింది.