NRML: కుబీర్ మండలం పాలజ్ కర్ర వినాయకుని దర్శనానికి వెళ్లే బస్సు రూట్ మ్యాప్‌ను బైంసా డిపో మేనేజర్ హరిప్రసాద్ పరిశీలించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని బట్టి బస్సుల ట్రిప్పులను పెంచుతామని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు.