KDP: పులివెందులలోని పార్నపల్లి బస్టాప్ వద్ద అపోలో మెడికల్ స్టోర్ సిబ్బంది ఆధ్వర్యంలో వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని అపోలో మెడికల్ అన్ని షాపుల సిబ్బంది కలిసి గురువారం సుమారు 1000 మందికి అన్నదానం చేశారు. ఈ మేరకు అపోలో సిబ్బంది ధాతృత్వాన్ని భక్తులు కొనియాడారు.