GNTR: పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు, వెల్లలూరు గ్రామాలలో గురువారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం జరిగింది. అధిక వర్షాల వల్ల పంట దెబ్బతినకుండా బీజామృతం, చేప మందు కషాయం వాడాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సూచించారు. ఎకరానికి రూ. 200 ఖర్చుతోనే పంటను కాపాడుకోవచ్చని తెలిపారు. ఆకు ముడత పురుగు నివారణకు నిమ్మరసం పిచికారి చేయాలని రైతులకు అవగాహన కల్పించారు.