ADB: బోరజ్ మండలంలోని డోలార వద్ద జరిగిన ప్రమాదంలో గాయాల పాలై చికిత్స పొందుతున్న CI సాయినాథ్‌ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇవాళ పట్టణంలోని ఆసుపత్రిలో పరామర్శించారు. స్థానిక నాయకులతో కలిసి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులున్నారు.