సత్యసాయి: కదిరిలో శ్రీ శిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రతీ నెల చివరి గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శ్రీ శిర్డీ సాయి సత్ సేవా సంఘ్ సభ్యులు ప్రకటించారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, కంటి పరీక్షలు సహా వివిధ వైద్య సేవలు అందించడంతో పాటు పాల్గొనే వారికి భోజన సౌకర్యం కల్పిస్తున్నందున ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కమిటీ సభ్యులు కోరారు.