సత్యసాయి: రొద్దం మండలం పి.రొప్పాలలో మంత్రి సవిత గురువారం పర్యటించనున్నారని క్యాంప్ కార్యాలయం తెలిపింది. ఉదయం 10 గంటలకు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి భూమిపూజ చేసి అనంతరం ఎన్టీఆర్ విగ్రహ స్థాపనకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆమె క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.