NRML: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. దీంతో సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు మొత్తం ఆరు గేట్లకు రెండు గేట్లు ఎత్తివేసి 80వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.