TG: వరద సహాయక చర్యలపై రాష్ట్ర CMO కీలక ప్రకటన చేసింది. ‘సీఎం రేవంత్ రెడ్డి వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటి వరకు రెస్క్యూ టీమ్స్ 1071 మందిని రక్షించాయి. వరద సహాయక చర్యల్లో SDRF, NDRF బృందాలు పాల్గొన్నాయి’ అని పేర్కొంది.