WNP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 28న భూమి పూజ చేయనున్నారు. పానల్ మండలంలోని దావాజిపల్లి తండాలో ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు విజయవంతం చేయాలని కోరారు.