HYDలో ఓవైపు గణేశుడు తొలి పూజను అందుకుంటుండగా, మరోవైపు నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. తెల్లవారు జామున ఉదయమే గణపతికి పూజలు చేసిన భక్తులు, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బేబీ పాండ్స్ వద్దకు వెళ్లి గణపతి నిమజ్జనాలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు దగ్గరుండి చర్యలు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.