NLG: తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి వినాయక ఉత్సవ నిర్వాహకులకు సుమారు రూ. 10 లక్షల చందాలు ప్రకటించి తన భక్తి భావాన్ని చాటుకున్నారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని 40 యువజన సంఘాలకు, ఇతర గ్రామాల్లోని ఉత్సవ నిర్వహణకు ఆయన విరాళాలను అందజేశారు. ప్రజలందరికీ బుధవారం ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.