MDK: మెదక్ పట్టణ మున్సిపల్ పరిధి 27వ వార్డు అంబేద్కర్ కాలనీలో మెదక్ ఆర్డీవో రమాదేవి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా అంబేద్కర్ కాలనీలో ఇండ్లలోకి నీరొచ్చి చేరింది. వరద నీరు వచ్చిన ఇండ్లను ఆర్డీవో రమాదేవి పరిశీలించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో రమాదేవి సూచించారు.