BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని జూలూరుపాడు, చుండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అదే విధంగా తాలిపేరు ప్రాజెక్టు కింద ఉన్న చర్ల మండల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు.