NLR: కందుకూరులోని సాలెపాలెంలో ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న కారు దగ్ధమైంది. తెల్లవారుజామున 3:30గంటల సమయంలో శబ్దం రావడంతో బయటికి వచ్చిన బాధితుడు నరేష్ కారు తగలబడుతుండడం కనిపించిందని వాపోయాడు. ఇది దుండగుల దుశ్చర్య అని అనుమానం వ్యక్తం చేశాడు. పక్కనే ఉన్న మరో రెండు కార్లకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.