GNTR: ప్రకాశం బ్యారేజీకి భారీ వరద కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్ట్ 11గేట్లు ఎత్తి 3.74 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీలోకి 3.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. బ్యారేజీ 69 గేట్లు ఎత్తి 3.49 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పెరిగితే మధ్యాహ్ననికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉంది.