PDPL: గణేష్ మండపాల నిర్వహణ విషయంలో పోలీసుల సూచనలు పాటించాలని నిర్వాహకులకు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్ర సేనారెడ్డి సూచించారు. ఈరోజు పట్టణంలోని వివిధ ప్రాంతాలలో వినాయక విగ్రహ మండపాలను ఆయన పరిశీలించారు. నిమజ్జనం అయ్యేంతవరకు ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.