GNTR: పెదకాకాని మండలం, వెనిగండ్ల బుడగ జంగాల కాలనీ, సుగాలీ కాలనీలలో డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతోంది. డ్రైనేజీలు తరచుగా పొంగిపొర్లి, మురుగు నీరు ఇళ్లలోకి, రోడ్లపైన నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.