ADB: సాత్నాల ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. బుధవారం ప్రాజెక్టు వరద గేట్లు నుంచి ఎప్పుడైనా నీళ్లను దిగువకు వదిలే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంతం దిగువన పశువులు, గొర్రెలు వెళ్లకుండా జాగ్రత్త ఉండాలని సూచించారు.