NLG: వినాయక చవితి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో గణపతి పూజలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా, సోదరభావంతో జరుపుకోవాలని కోరారు. మండపాల వద్ద పోలీసుల సూచనలను నిర్వాహకులు పాటించాలని పేర్కొన్నారు.