MBNR: జిల్లాలోని పేదల తిరుపతిగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్‌కు ఓ భక్తుడు విరాళం అందజేశారు. దేవరకద్రకు చెందిన కర్ణం రాజు రూ.లక్ష చెక్కును ట్రస్ట్ నిర్వాహకులకు బుధవారం అందజేశారు. అనంతరం రాజు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.