TPT: బైక్ అదుపుతప్పి యువకుడు గాయపడిన ఘటన సదుంలో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గుర్తు తెలియని యువకుడు కలికిరి మార్గంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్దనున్న బ్రిడ్జి గోడను బైక్పై వెళుతూ అదుపుతప్పి ఢీకొన్నాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది అతడిని పీలేరుకు తరలించారు. క్షతగాత్రుడిది చింతపర్తివారిపల్లిగా తెలిసింది.