W.G: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం జిల్లాలో అధికంగా చూపిస్తోంది. నిన్న జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీవర్షాలు కురిశాయి. ఈరోజు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఎడతెరిపి లేని వర్షంతో ప్రయాణాలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.