KNR: భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. బుధవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద ఎక్కువ వచ్చే అవకాశం ఉందని, దీంతో నదులు, వాగు పరిసరాల ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.