MBNR: బాలానగర్‌లో గురువారం బిహార్‌కు చెందిన ఓ యువకుడు రోడ్డుపై అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ సమాచారం అందుకున్న బ్లూ కోర్ట్ పోలీసులు దేవేందర్ రెడ్డి, సునీల్ అక్కడికి చేరుకున్నారు. సమయస్ఫూర్తితో స్పందించి వారు ఆ యువకుడికి CPR చేసి ప్రాణాలను కాపాడారు. అనంతరం చికిత్స నిమిత్తం అతన్ని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.