ATP: గుత్తి మెయిన్ బజార్లోని వినాయకుడి గుడిలో వినాయక చవితి వేడుకలలో భాగంగా 2వ రోజు గురువారం శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ స్వామి వారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, ఆకు పూజ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.