VZM: దళితుల కోసం లక్కవరపుకోట మండలం కల్లేపల్లిలోని స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని CPM జిల్లా కమిటీ సభ్యుడు గాడి అప్పారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక MRO కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. స్మశాన వాటిక స్థలం లేకపోవడం వల్ల మరణించిన వారిని ఎక్కడ పూడ్చి పెట్టాలన్నది ప్రశ్నార్ధకంగా మారిందన్నారు.