ASF: కాగజ్ నగర్ పట్టణంలోని తన నివాసంలో స్వేరో నాయకులతో సుప్రీం స్వేరో RS ప్రవీణ్ కుమార్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యారంగా సమస్యల పరిష్కారం కోసం స్వేరోలు విస్తృతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. స్వేరోఇజంను ప్రతి గ్రామానికి తీసుకెళ్లి గ్రామ కమిటీలను బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు.