TG: కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్,ఎస్పీ రాజేశ్ చంద్రలను అప్రమత్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం నిత్యం అందుబాటులో ఉండాలని తెలిపారు.